‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ‘సాహో’ బ్యూటీ

Shraddha Kapoor to Replace Daisy Edgar Jones in RRR - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ తారలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ను తీసుకున్నారు.

కానీ వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రయూనిట్ మరో హీరోయిన్‌ కోసం వేట ప్రారంభించింది. తాజా ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌కు జోడి ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాతో సౌత్‌ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ ను ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మరి హాలీవుడ్ హీరోయిన్‌ చేయాల్సిన పాత్రలో శ్రద్ధా ఎంతవరకు సూట్ అవుతుందో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top