అధికారం కాదు హక్కు!

Shahid Kapoor, Shree Narayan Singh's Batti Gul Meter Chalu - Sakshi

ఓ గంట.. కాదు.. కాదు.. అరగంట.. కాదు.. కాదు.. పది నిమిషాలు.. కాదు.. కాదబ్బా... ఐదు నిమిషాలు కరెంటు లేకపోతే జీవితం మొత్తం చీకటైనట్లుగా ఫీలైపోతాం. అసలు పవర్‌ లేకుండా.. దీపాలు, లాంతర్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నవాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లు ఫేస్‌ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘బట్టీ గుల్‌ మీడర్‌ చాలా’. అంటే... కొంచెం వేచి చూడండి అని అర్థం. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరో. ‘‘ఎలక్ట్రిసిటీ పవర్‌ని వాడుకునే అధికారం కొందరికే కాదు.. పవర్‌ని వినియోగించుకునే హక్కు అందరికీ ఉండాలని, అలాంటి పరిస్థితులు రావాలని ఆశిద్దాం. నారాయణ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా’’ అని షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు. ‘‘ఉత్తరాఖండ్‌లో షూట్‌ స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇక్కడి ప్రభుత్వం షూట్‌కు పర్మిషన్‌ ఇచ్చింది’’ అన్నారు దర్శకులు నారాయణ్‌ సింగ్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్‌ 31న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top