బాత్రూం ఉత్పత్తులకు బాద్షా ప్రచారం!

బాత్రూం ఉత్పత్తులకు బాద్షా ప్రచారం!


బాత్రూం ఉత్పత్తుల సంస్థ 'హింద్వేర్'కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రచారకర్తగా ఉండబోతున్నారు. ఆ సంస్థ పనితీరు తనకు నచ్చడం వల్లే వాళ్ల ఆఫర్ను అంగీకరిస్తున్నట్లు షారుక్ చెప్పారు. చాలా ఏళ్లుగా బాత్రూం ఉత్పత్తులు అంటేనే హింద్వేర్ గుర్తుకొస్తుందని ఆయన అన్నారు. త్వరలోనే ఆ సంస్థ ప్రారంభించే 360 డిగ్రీల సమీకృత ప్రచారంలో షారుక్ పాల్గొంటారు.కాగా, షారుక్ పాటించే విలువలను దృష్టిలో ఉంచుకునే అతడిని తాము ఎంచుకున్నట్లు హెచ్ఎస్ఐఎల్ జాయింట్ ఎండీ సందీప్ సోమానీ తెలిపారు. దేశంలో ఏ వయసు వాళ్లయినా కూడా షారుక్ను అభిమానించకుండా ఉండలేరని, అన్ని వర్గాలకూ ఆయన కావల్సిన వాడేనని చెప్పారు. బాత్రూం ఉత్పత్తులు అనేవి మగవాళ్లకో.. లేదా ఆడవారికో మాత్రమే పరిమితం కాదని షారుక్ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top