సల్మాన్ టీజర్ షేర్ చేసిన షారూఖ్
ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు ఇప్పుడు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. భజరంగీ భాయ్ జాన్ సినిమా సమయం నుంచి ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతూ వస్తోంది. భజరంగీ భాయ్‌జాన్ సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్లో రిలీజ్ చేసిన షారూఖ్, ఆ సినిమా ప్రమోషన్లో సల్మాన్‌కు చాలా సాయం చేశాడు. అదే బాటలో సల్మాన్ కూడా దిల్వాలే రిలీజ్ సమయంలో షారూఖ్‌కు సాయపడ్డాడు.
తాజాగా సల్మాన్ సినిమా సుల్తాన్ టీజర్‌ను షారూఖ్ షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గత సినిమాలతో పోలిస్తే సుల్తాన్ పరిస్థితి వేరు. ఈ సినిమా షారూఖ్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్‌కు పోటిగా విడుదలవుతోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా షారూఖ్, సల్మాన్ టీజర్‌ను పొగడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మంగళవారం రిలీజ్ అయిన సుల్తాన్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.
Kya baat hai...Haryana ka Sher aa gaya...Sultan Bhaijaan https://t.co/PB8JynGyKf
— Shah Rukh Khan (@iamsrk) 12 April 2016