ధైర్యమంటే నీదే.. నువ్వే నా రాణివి: సమంత

ధైర్యమంటే నీదే.. నువ్వే నా రాణివి: సమంత


సాక్షి, హైదరాబాద్‌: కంగనా రనౌత్‌.. విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనే కాదు.. నిజ జీవితంలో ఆమె మాటలు తూటాల్లా పేలుతాయి. ఆమె ధైర్యానికి కథానాయిక సమంత ఫిదా అయ్యారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా కంగనా నటించిన ఓ ప్రత్యేక పాట వీడియోను షేర్‌ చేశారు.ఈ పాట ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కంగనా ఎంతో ధైర్యంగా ఇలాంటి పాటలో నటించారని చెప్పుకుంటున్నారు. ఈ పాట వీడియోపై స్పందించిన శామ్‌.. ‘లెజెండరీ.. ధైర్యానికే ఓ ముఖం ఉంటే అది నువ్వే క్వీన్‌’ అని ట్వీట్‌ చేశారు. హీరో హృతిక్‌రోషన్‌, నిర్మాత ఆదిత్యా పంచోలీలతో కంగనాకు ఉన్న పాత వివాదం మళ్లీ చెలరేగిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కంగనా ఈ పాటలో నటించడం గమనార్హం.

Back to Top