ఆ ప్రయత్నం వర్కౌట్‌ కాలేదా?

Samantha Romance With Vijay Sethupathi - Sakshi

సినిమా: సమంత ప్రయత్నం వర్కౌట్‌ కానట్టుంది. సవాళ్లంటే తనకిష్టం అని చెప్పే ఈ చిన్నది ఆ మధ్య తెలుగు, తమిళంలో వరుస విజయాలను అందుకుంది. అయితే ప్రస్తుతం కాస్త స్పీడ్ ను తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ బ్యూటీ చేతిలో కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న సూపర్‌ డీలక్స్‌ చిత్రం ఒక్కటే ఉంది. అదేవిధంగా టాలీవుడ్‌లోనూ తన భర్తతో కలిసి ఒక చిత్రం చేస్తోంది. తాజాగా మరో చిత్రానికి సిద్ధమవుతోంది. కొరియన్‌ చిత్రం మిస్‌ గ్రానీ రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. 2014లో రూపొందిన ఈ చిత్రం ఆ తరువాత చైనా, జపాన్, థాయ్‌ల్యాడ్, ఇండోనేషియా భాషల్లో రీమేక్‌ అయ్యి విజయం సాధించింది. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ కానుంది.

ఇది  భర్తను కోల్పోయిన 74 ఏళ్ల బామ్మ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని సమాచారం. కుటుంబానికి భారంగా మారిన ఆ బామ్మ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒక ఫొటో స్టూడియోకు చేరుకుంటుంది. అక్కడ అదృశ్యశక్తులతో 20 ఏళ్ల యువతిగా మారిపోతుంది. ఆ తరువాత ఎదురయ్యే సలు సమస్యలను, సవాళ్లను వినోదభరితంగా ఆవిష్కరించిన చిత్రమే మిస్‌ గ్రానీ. కాగా 74 ఏళ్ల బామ్మగానూ, 20 యువతిగానూ నటి సమంతనే నటించడానికి రెడీ అయ్యింది. భామ్మ పాత్రగా ఈ బ్యూటీని మార్చడానికి విదేశాల నుంచి మేకప్‌ నిపుణులను రప్పించారు. పలు విధాలుగా సమంతను తన మేకప్‌ నైపుణ్యంతో మార్చే ప్రయత్నం చేసినా సెట్‌ కాలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతో పాటు సమంతను మిస్‌ గ్రానీ చిత్రంలో 20 ఏళ్ల యువతిగానే నటింపజేయనున్నారట. ఇక 74 ఏళ్ల బామ్మ పాత్రను నటి లక్ష్మితో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజాసమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top