అర్జున్‌ రెడ్డి నచ్చింది కానీ.. ఆ కాన్సెప్ట్‌ నచ్చలేదు : సమంత

Samantha Differs Sandeep Reddy Vanga Thoughts About Arjun Reddy - Sakshi

ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఇలాంటివి రోజూ జరగుతూనే ఉంటాయి కానీ ఈ ఘటనలో సమంత ఎంటర్‌ అవ్వడం.. సంజాయిషీ ఇచ్చుకోవడమే ఇక్కడ ప్రత్యేకం. అసలు ఏం జరిగిందంటే.. అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌పై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే . అయితే ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్‌ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. 

ఆయన వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ.. ‘ఈ వ్యాఖ్యలు చాలా అసంతృప్తిని కలిగించాయ’న్నారు. సమంత స్పందనపై ఆ ఆంగ్ల మీడియా సంస్థ ట్విటర్‌లో ఈ వార్తను పోస్ట్‌ చేస్తూ.. ‘అప్పుడేమో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా బాగుందన్నారు. ఇప్పుడు సందీప్‌ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయి అంటున్నారు. సమంతది రెండు నాల్కల ధోరణి’ అని పేర్కొంది. దీనికి సమంత సమాధానమిస్తూ.. ‘ఒక సినిమాను ఇష్టపడటం వేరు. ఒకరు చేసిన వ్యాఖ్యలతో విభేదించడం వేరు. నాకు ‘అర్జున్‌రెడ్డి’ కథ బాగా నచ్చింది. దానర్థం ఇష్టమొచ్చినట్లుగా మనతో ఉన్నవారిపై చేయి చేసుకునే కాన్సెప్ట్‌ కూడా నాకు నచ్చిందని కాదు’ అని బదులిచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top