సమంత ఆధ్వర్యంలో వేలం పాట

Samantha AUCTION for Pratyush foundation

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తానే స్వయంగా ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి చిన్నారుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఫౌండేషన్ కోసం ఓ వేలంపాటను నిర్వహించనుంది సమంత. గతంలోనూ సినిమాల్లో టాప్ స్టార్స్ ఉపయోగించిన వస్తువులను, దుస్తులను వేలం వేసి పెద్ద ఎత్తున విరాళాలు కలెక్ట్ చేశారు.

అదే బాటలో ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 6.30 నిమిషాలకు వేలం నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. గత వేలంలో దూకుడు సినిమాలో మహేష్ బాబు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ వాడిన వస్తువులను వేలం వేసిన సమంత టీం, ఈ వేలం కోసం ఏడాదిగా స్టార్ హీరోల నుంచి వస్తువులను సేకరిస్తున్నారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

Back to Top