నటనకు విరామం

Samantha And Naga Chaitanya Stops Acting Few Days - Sakshi

టీ.నగర్‌: నటనకు సమంత విరామం తీసుకోనున్నట్లు సమాచారం. నటుడు సూర్యను వివాహమాడిన తర్వాత నటనకు దూరమైన నటి జ్యోతిక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ నటించేందుకు వచ్చారు. ప్రస్తుతం హీరోయిన్‌ ప్రాధాన్యతగల పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అదేకోవలో గతేడాది నటుడు నాగచైతన్యను సమంత వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమె నటనకు దూరం కాకుండా వరుసగా చిత్రాలను ఒప్పుకుని నటిస్తున్నారు. గతేడాది మెర్షల్‌ వంటి రెండు చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది సీమరాజా, యూటర్న్, సూపర్‌ డీలక్స్‌ వంటి మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ముందుగా ఆమె నటించిన నడిగయర్‌ తిలగం, ఇరుంబు తిరై చిత్రాలు గత నెలలో విడుదలయ్యాయి.

వచ్చే ఏడాది కొత్త చిత్రాల్లో నటించేందుకు కొందరు దర్శకులు సమంతను కాల్షీట్లు కోరగా నటించేందుకు ఆమె నిరాకరించారు. దీంతో సమంత నటనకు స్వస్తి చెప్పనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిగురించి వివరణ ఇచ్చిన ఆమె భర్త నాగచైతన్య సమంత నటన నుంచి ఒకేసారి వైదొలగరని, కొంత విరామం తీసుకుని మళ్లీ చిత్రాల్లో నటిస్తారని తెలిపారు. నటనకు బ్రేక్‌ ఇవ్వాలని సమంత నిర్ణయించుకోవడం వెనుక ఆంతర్యమేమిటని అభిమానులు వెబ్‌సైట్లలో ప్రశ్నిస్తున్నారు. ఇందుకు చైతన్య, సమంత బదులివ్వకుండా మౌనం వహిస్తున్నారు. ఒకవేళ సమంత త్వరలో మాతృత్వపు అనుభూతులను అందుకోనున్నదని, అందుకోసమే ఈ విరామం కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top