సెలవుల్లో సమంత.. చైతూ ఎంజాయ్!
కాబోయే భార్యాభర్తలు సమంత, నాగచైతన్య సెలవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తన గ్యాంగు మొత్తాన్ని తీసుకొచ్చి చైతన్యతో వాళ్ల కోసం స్నాక్స్ చేయించింది. ప్రేమమ్ సినిమాలో చెయ్యి తిరిగిన చెఫ్‌గా నటించిన నాగ చైతన్య.. నిజ జీవితంలో కూడా వంటను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏదో గ్రిల్డ్ స్నాక్స్‌ను తయారుచేసి సమంత స్నేహితురాళ్లకు అందిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే వెల్లడించింది. తన సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ ఫొటోలను షేర్ చేసింది.నాగ చైతన్య గ్రిల్లర్ వద్ద ఉండి స్నాక్స్ వండుతుంటే.. తొలుత పక్కనే ఉండి కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, ఆ తర్వాత వెనక నుంచి చైతన్యను హగ్ చేసుకుని ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత స్నేహితురాళ్లతో కూర్చుని చైతూ ఇచ్చిన స్నాక్స్‌ను మహారాణిలా ఆరగించడం.. ఈ మూడు ఫొటోలను సమంత షేర్ చేసింది. ''నాకు ఇది ఉంటే.. జీవితంలో అంతా ఉన్నట్లే'' అని ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. కుటుంబమే సమస్తమని, చైతన్య పట్ల తనకు ప్రేమ, గౌరవం, కృతజ్ఞత అన్నీ ఉన్నాయని కూడా హ్యాష్ ట్యాగ్‌ల ద్వారా తెలిపింది. నిన్న మొన్నటి వరకు షూటింగులలో బిజీగా గడిపిన వీళ్లు ఇప్పుడు కాస్త సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్లు కనపడుతోంది.

Back to Top