ఎన్ని కళలో!

Sakalakala Vallabhudu Movie Press Meet - Sakshi

తనిష్క్‌ రెడ్డి, మేఘ్లా ముక్తా జంటగా శివ గణేశ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. బీరం సుధాకర్‌ రెడ్డి సమర్పణలో అనిల్, శ్రీకాంత్, త్రినాథ్, కిషోర్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నటించిన ఏ ఒక్కరూ కొత్తవారిలా అనిపించరు. అంత అద్భుతంగా నటించారు. తనిష్క్‌రెడ్డి భవిష్యత్‌లో పెద్ద స్టార్‌ అవుతాడు. అతనితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

‘‘సినిమా అవుట్‌పుట్‌ చూసుకున్నాం. సంతృప్తిగా ఉంది. నిర్మాతలు సపోర్ట్‌ చేయడం వల్లే సినిమా అంత బాగా వచ్చింది’’ అని శివగణేష్‌ అన్నారు. ‘‘కథలో కంటెంట్‌ ఉంటే సపోర్ట్‌ చేయడానికి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వారిలో బీరం సుధాకర్‌రెడ్డి ఒకరు. ఆయనకు అనిల్, శ్రీకాంత్‌ తోడై ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ, ఫైట్స్, సెంటిమెంట్‌.. అన్నీ ఉన్నాయి’’ అని తనిష్క్‌ రెడ్డి అన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, నటి అలెక్సా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top