
ఆ వార్త నిజం కాదు
సైఫ్-కరీనా దంపతుల కుమారుడు హీరో అవుతాడా? టెక్నీషియన్ అవుతాడా? అనే చర్చ మొదలైంది.
సైఫ్-కరీనా దంపతుల కుమారుడు హీరో అవుతాడా? టెక్నీషియన్ అవుతాడా? అనే చర్చ మొదలైంది. ‘ఆలూ లేదు! చూలూ లేదు! కొడుకు పేరు సోమలింగం’ అని సామెత చెప్పినట్టు, కరీనా గర్భవతి అని చెప్పగానే.. పుట్టబోయేది వారసుడే అని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు.
లండన్‌లో సైఫ్, కరీనా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, వైద్యులు కరీనాకు మగబిడ్డ పుడతాడని చెప్పారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ‘‘లండన్‌లో సైఫ్- కరీనాలు ఏ డాక్టర్‌నూ కలవలేదు. ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి’’ అని సైఫ్-కరీనాల ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.