తెలుగు.. తమిళం.. ప్రేమపల్లవి..!

తెలుగు.. తమిళం.. ప్రేమపల్లవి..!


పాట పల్లవితో ప్రారంభమవుతుంది. హీరో నాగశౌర్య తమిళ ప్రేమకథ ‘ప్రేమమ్‌’ పల్లవితో ప్రారంభం కానుంది. ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, ఒక మనసు, జ్యో అచ్యుతానంద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య త్వరలో తమిళ తెరకు పరిచయం కానున్నారు.ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ తెలుగు, తమిళ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ సాయి పల్లవి నటించనున్నారు. చక్కని ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్‌. రజనీకాంత్‌ ‘2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

Back to Top