సిస్టర్‌ ఎంట్రీపై హీరోయిన్‌ క్లారిటీ!

Sai Pallavi Clarifies About Her Sister Pooja Entry To Kollywood - Sakshi

తన నటనతో అందర్నీ ఫిదా చేసింది సాయి పల్లవి. సోషల్‌ మీడియాలో వీడియో సాంగ్స్‌తో దుమ్ము రేపుతోన్న సాయి పల్లవి.. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. అయితే సాయిపల్లవిని సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే వారికి తన సిస్టర్‌(పూజా) గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇటీవలె పూజా సినిమాల్లోకి రాబోతోందంటూ రూమర్స్‌ వినిపించాయి.

ఆ మధ్య ధనుష్‌తో కలిసి పూజా దిగిన ఓ పిక్‌ వైరల్‌ కాగా.. పూజా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే తాను ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చేస్తోందని, తన దృష్టంతా చదువుపైనే ఉందని, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తల్లో నిజం లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ప్రస్తుతం రానాకు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top