నవంబర్‌ నుంచి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’

RRR Shooting Starts In November - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లు హీరోలుగా దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు చాలా రోజులుగా జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తుండటం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అరవింద సమేత చేస్తుండటంతో రాజమౌళి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top