బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

Rohini May Eliminated in Bigg Boss 3 Telugu Fourth Week - Sakshi

వీకెండ్‌లో వచ్చిన నాగార్జున.. హౌస్‌మేట్స్‌కు ఫన్నీ అవార్డులను ప్రకటించడం.. కిచెన్‌లో వచ్చిన గొడవతో పునర్నవి అలగడం.. వితికా వెళ్లి వరుణ్‌తో మొరపెట్టుకోవడం.. తనకు సపోర్ట్‌గా మాట్లాడటం లేదని వితికా కూడా అలగడం.. తన వెనుకే వరుణ్‌ వెళ్లి మాట్లాడటం.. గొడవ తగ్గకపోవడంతో వితికాను హగ్‌ చేసుకోవడం.. టాస్క్‌లో ప్రొటెక్టర్‌ టీమ్‌ గెలవడంతో అటాకర్‌ టీమ్‌ సభ్యులను కించపర్చడంపై రవికృష్ణ, అషూ మాట్లాడుకోవం.. పునర్నవి-రాహుల్‌ తమపై వచ్చే మీమ్స్‌ గురించి మాట్లాడుకోవడం.. వీకెండ్‌ ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి.

బిగ్‌బాస్‌ ఇచ్చిన డాబర్‌ పేస్ట్‌ టాస్క్‌లో  ప్రొటెక్టర్‌.. అటాకర్‌గా రెండు టీమ్స్‌గా విడగొట్టారు. ఈ టాస్క్‌లో న్యాయ నిర్ణేతగా వరుణ్‌సందేశ్‌ వ్యవహరించాడు. టాస్క్‌లో ప్రొటెక్టర్‌ టీమ్‌ గెలవడంతో ఆ టీమ్‌ సభ్యులైన శ్రీముఖి, అలీ..  అటాకర్‌ టీమ్‌ సభ్యులైన రవి, అషూను కించపర్చడంతో వారు హర్ట్‌ అయ్యారు. బయట సైమా అవార్డుల పండగ జరగుతూ ఉంటే.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫన్నీ అవార్డుల కార్యక్రమం జరిగింది. ప్రతీ ఇంటి సభ్యుడిని తమ ప్రవర్తనకు అనుగుణంగా ఓ అవార్డును ప్రకటించారు. ఈ వారంలో అషూ తనను  నామినేట్‌ చేసిన విషయాన్ని మనసులో ఉంచుకున్నందుకు  బాబా భాస్కర్‌కు ప్రెజర్‌ కుక్కర్‌ అవార్డును ప్రకటించారు. అందరితో మంచి అనిపించుకోవాలనే వ్యాధి అన్నింటి కంటే భయంకరమైందని బాబా భాస్కర్‌కు సూచించాడు. రోహిణి విషయంలో తన అనాలసిస్‌ చెప్పడం తప్పని, అయితే చివరివరకు రాహుల్‌ను నామినేట్‌ చేస్తూ ఉంటానని చెప్పడం ఫెయిర్‌నెస్‌ అని శ్రీముఖిని ఉద్దేశించి అన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అరుస్తూనే ఉంటుందని లైడ్‌ స్పీకర్‌ అవార్డును శ్రీముఖికి ప్రకటించారు.

టాస్క్‌లో పాల్గొనకుండా కామెంట్లు చేస్తుండటంతో పునర్నవికి అంపైర్‌ అవార్డును ప్రకటించారు. ఎక్కువగా అలుగుతుందని, కోపం కూడా వస్తోందని తగ్గించుకోవాలని నాగ్‌ సూచించాడు. తనకిష్టమైన వారి దగ్గరే అలుగుతానని పునర్నవి చెప్పగా.. మరి రాహుల్‌ దగ్గర చేసినట్టు కనిపించలేదని నాగ్‌ సెటైర్‌ వేయగా.. రాహుల్‌ స్పందిస్తూ.. అరాచకం చూపిస్తుందని తెలిపాడు. ఈ వారం మాత్రం కాస్త ఎక్కువగానే అలిగానని, ఇక ఇప్పటినుంచి అలా చేయనని, టాస్క్‌లో కూడా పార్టిసిపేట్‌ చేస్తానని తెలిపింది. మాటలు బాగా మాట్లాడుతాడు కానీ చేతలు మాత్రం ఉండవని నాగ్‌ చురకలంటించాడు. పాటలు బాగా పాడుతావ్‌.. ఆటలు కూడా ఆడాలి అంటూ సూచించాడు. శ్రీముఖి విషయంలో రాహుల్‌ సారీ చెప్పి మళ్లీ వెనకాల మాట్లాడటం సరికాదన్నాడు. ఆటలో అరిటిపండు.. అషూ, పుల్లలుపెట్టే అవార్డు.. మహేష్‌, భూతద్దం అవార్డు.. వితికా, ఆనియన్‌ అవార్డు.. శివజ్యోతి, ఫ్లూట్‌ అవార్డు.. అలీ, కత్తెర అవార్డు.. రోహిణి, పైనాపిల్‌ అవార్డు.. వరుణ్‌, పెద్ద చెవి అవార్డు రవికృష్ణ, చిచ్చుబుడ్డి అవార్డు.. హిమజలకు ఇచ్చాడు. 

అయితే ఇక నామినేషన్స్‌లో భాగంగా శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ సేవ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం, సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ పట్టి చూస్తే రోహిణి ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే రోహిణి ఎలిమినేట్‌ అయిందా? లేదా తెలియాంటే ఆదివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

మరిన్ని వార్తలు

15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
14-09-2019
Sep 14, 2019, 19:33 IST
బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు...
14-09-2019
Sep 14, 2019, 19:06 IST
బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు...
14-09-2019
Sep 14, 2019, 17:07 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారంలో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
14-09-2019
Sep 14, 2019, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం...
13-09-2019
Sep 13, 2019, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి....
13-09-2019
Sep 13, 2019, 18:00 IST
అవును మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే...
13-09-2019
Sep 13, 2019, 17:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి...
13-09-2019
Sep 13, 2019, 16:17 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
12-09-2019
Sep 12, 2019, 23:10 IST
బిగ్‌బాస్‌ చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తే.. అందరూ అది పాటించాల్సిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన మాటే శాసనం అవుతుంది. అలాంటి...
12-09-2019
Sep 12, 2019, 18:56 IST
బిగ్‌బాస్‌ అని ఊరికే అనలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఆదేశాలను ధిక్కరించేవారిని ఊరికే వదిలిపడతాడా? తన ముందు తలొంచేలా చేస్తాడు. బిగ్‌బాస్‌...
12-09-2019
Sep 12, 2019, 17:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ పునర్నవిలు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌...
12-09-2019
Sep 12, 2019, 16:52 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో...
12-09-2019
Sep 12, 2019, 09:30 IST
సాక్షి, హైదరాబాద్‌: తమిళ్‌ బిగ్‌బాస్‌-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి...
11-09-2019
Sep 11, 2019, 22:52 IST
ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం..  టాస్క్‌ బిగ్‌బాస్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి, మహేష్‌లు బిగ్‌బాస్‌కు ఎదురుతిరిగారు. టాస్క్‌లో...
11-09-2019
Sep 11, 2019, 16:31 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యాలు పడ్డాయి. వాటి కోసం కోర్ట్‌ యార్డ్‌లో స్మశానాన్ని కూడా నిర్మించాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులను మనుషులు, దెయ్యాలు అంటూ...
10-09-2019
Sep 10, 2019, 23:00 IST
బిగ్‌బాస్‌ హౌస్‌ దెయ్యాల కోటగా మారింది. ఇంట్లోని కొంతమందిని దెయ్యాలుగా మార్చిన బిగ్‌బాస్‌.. మిగతావారిని హత్య చేసి దెయ్యాలుగా మార్చాలనే టాస్క్‌...
10-09-2019
Sep 10, 2019, 21:44 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top