రాజా స్టార్ట్‌ రోలింగ్‌

raviteja disco raja regular shooting dec 12 - Sakshi

నెక్ట్స్‌ సినిమాలో మాస్‌ రాజా రవితేజ కాస్తా డిస్కో రాజాగా కనిపించనున్నారు. మరి ఎప్పటి నుంచి డిస్కో రాజా పాత్రలోకి మారిపోతారో మేం చెబుతాం.  దర్శకుడు వీ.ఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘డిస్కో రాజా’. రామ్‌ తాళ్లూరి నిర్మాత. ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ చిత్రంలో ఆల్రెడీ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపిక అయ్యారు. ఈ సినిమా రెగ్యులర్‌ షుటింగ్‌ ఈ నెల 13న స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో రవితేజ తండ్రీకొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top