రాజా రెడీ

Ravi Teja New Movie With Vikram Sirikonda - Sakshi

హీరో రవితేజ రెడీ అయ్యారు. అటు క్లాస్‌ ఇటు మాస్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఆయన ఈసారి మాస్‌ ప్లస్‌ క్లాస్‌ లాంటి సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. ‘సొగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్‌ వేడుక చుద్దాం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టి ఈ నెలలోనే సెట్స్‌ పైకి తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారని సమాచారం. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ‘సొగ్గాడే చిన్ని నాయనా’ మంచి ఫ్యామిలీ డ్రామా.

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ఫ్యామిలీ ప్లస్‌ లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ స్టోరీ. రవితేజకు మాస్‌ మహారాజ్‌ అనే టైటిల్‌ ఉంది కాబట్టి ఆయన హీరోగా తెరకెక్కించబోయే సినిమాలో లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా కల్యాణ్‌ కృష్ణ కథ రాసుకున్నారట. రీసెంట్‌గా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ప్రేక్షకుల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు మరో హిట్‌ను అందించేందుకు రాజా రెడీ అన్నమాట. ప్రజెంట్‌ ‘టచ్‌ చేసి చూడు’ సినిమా షూటింగ్‌తో బిజీ ఉన్నారు రవితేజ. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయిక.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top