క్యాన్స‌ర్‌తో బాలీవుడ్ న‌టుడు మృతి

Rattan Chopra Dies With Cancer In Punjab - Sakshi

చండీగఢ్: చిత్ర ప‌రిశ్ర‌మ‌‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ న‌టుడు ర‌త‌న్ చోప్రా శుక్ర‌వారం క‌న్నుమూసిన విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. జ‌న‌వ‌రిలో క్యాన్స‌ర్ బారిన ప‌డిన‌ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో పంజాబ్‌లోని మాల‌ర్‌కోట్ల‌లో తుది శ్వాస విడిచాడు. ర‌త‌న్ చోప్రా కొంత‌కాలంగా గడ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా హ‌ర్యానాలోని పాంచ్‌కుల‌లో అద్దె నివాసంలో ఉంటున్నాడు. తిన‌డానికి కూడా తిండి లేక‌పోవ‌డంతో స‌మీపంలోని ఆల‌యాలే అత‌నికి ఆహారాన్ని పెడుతున్నాయి. అతను వివాహం చేసుకోకుండా అనిత అనే యువ‌తిని కూతురిగా ద‌త్త‌త తీసుకున్నాడు. త‌న తండ్రి క్యాన్స‌ర్‌ చికిత్స కోసం కూడా డ‌బ్బులు లేని దీన‌ స్థితిలో మ‌రణించాడ‌ని అనిత మీడియాతో వాపోయింది. మ‌రోవైపు.. కొద్ది రోజుల క్రితం అత‌డు బాలీవుడ్ న‌టులు ధ‌ర్మేంద్ర‌, అక్ష‌య్ కుమార్‌, సోనూసూద్‌ల నుంచి ఆర్థిక సాయం కోరిన‌ప్ప‌టికీ వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ని ర‌త‌న్ చోప్రా బంధు‌వులు తెలిపారు. (నేనేమీ మారలేదు.. అలాగే ఉన్నా..)

కాగా ర‌తన్ చోప్రా పంజాబ్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడుయ్యేట్ ప‌ట్టా అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌టియాలాలో పీజీ విద్య అభ్య‌సించాడు. అనంత‌రం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాల్లో న‌టించాడు. అల‌నాటి న‌టి, హీరోయిన్ కాజోల్‌తో క‌లిసి "మామ్ కీ గుడియా" చిత్రంలో ప్ర‌ధాన పోత్ర పోషించాడు. అయితే అత‌ని నాన‌మ్మ‌కు న‌ట‌నా రంగంపై ఇష్టం లేనందున అత‌ను సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు. అలా అత‌ను చేజార్చుకున్న జూమ్ కీ, జుగ్ను, అయా సావ‌న్ చిత్రాలు ధ‌ర్మేంద్ర తలుపు త‌ట్టాయి. సినీ కెరీర్ అనంత‌రం న‌టుడు ప‌లు స్కూళ్ల‌లో ఇంగ్లిష్ బోధిస్తూ జీవనం సాగించాడు. (ప్రముఖ టీవీ నటుడు కన్నుమూత)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top