ఎక్కడైనా ఒకేలా ఉంటా

Ranveer Singh's off-screen antics - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌ అనగానే మనందరికీ అంతులేని ఎనర్జీ, విభిన్న వేషధారణ.. ఇవన్నీ గుర్తొస్తాయి. స్క్రీన్‌ మీద, మీడియా ముందు కనపడే సమయాల్లో రణ్‌వీర్‌ సింగ్‌ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ ఆఫ్‌స్క్రీన్‌ రణ్‌వీర్‌ ఎలా ఉంటాడు? కెమెరా ముందు విభిన్నంగా ఉండటం కేవలం మార్కెటింగ్‌ స్ట్రాటజీనా? విచిత్ర వేషధారణ అంతా ఆకట్టుకోవడానికేనా? ఇదే ప్రశ్నలను రణ్‌వీర్‌ ముందుంచితే ‘‘నాది భిన్న మనస్త్వత్వం. మీరు అందరిలా ఉండరు అని ఎవరైనా నాతో చెబితే ‘నాకు తెలుసు. ఇకపై కూడా అలానే ఉంటాను’ అని బదులిస్తాను.

నా చేష్టలు, నా అలవాట్లు, నా వైఖరి ఏంటో నా చిన్ననాటి మిత్రులకు తెలుసు. ఇవన్నీ నిన్నో మొన్నో పుట్టుకొచ్చినవి కాదు. అలాగే విభిన్నంగా ఉండే దుస్తులు  ధరించడం చిన్నప్పటి నుంచి అలవాటే. ఇదంతా ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించడానికి అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆన్‌స్క్రీన్‌ అయినా ఆఫ్‌స్క్రీన్‌ అయినా నేను ఒకేలా ఉంటాను. అందరూ నన్ను ఇలానే ఇష్టపడతారనుకుంటున్నాను. నన్ను నేను ఇలానే ఇష్టపడతాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘83’ సినిమాతో బిజీగా ఉన్నారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top