సినిమా పనులు మొదలెట్టిన రణ్‌వీర్‌

Ranveer Singh Resumes Simmba Dubbing Work - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌‌, దీపికా పదుకొనేల వివాహం ఇటీవల ఇటలీలో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ జంట తరువాత బెంగళూరు భారీగా రిసెప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 14న పెళ్లి చేసుకున్ రణ్‌వీర్‌ అప్పుడే సినిమా పనులు కూడా మొదలెట్టేశాడు.

రణ్‌వీర్‌ ప్రస్తుతం టెంపర్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సింబాలో నటిస్తున్నాడు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించటంతో ఆలస్యం చేయకుండా ముంబైలోని ఓ స్టూడియోలో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించాడు రణ్‌వీర్‌. సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 28న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top