ఇట్స్‌ పార్టీ టైమ్‌

Ranveer Singh and Alia Bhatt are going to be seen together in Zoya Akhtar Gully Boy - Sakshi

దాదాపు పది నెలల టైమ్‌ ఉంది సినిమా రిలీజ్‌కు. కానీ అప్పుడే షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి, తియ్య తియ్యని కూల్‌ కేక్‌ పంచి టీమ్‌తో సెల్ఫీకి ఫోజిచ్చి ఆ నెక్ట్స్‌ గ్రాండ్‌ పార్టీ చేసుకున్నారు ‘గల్లీబాయ్‌’ అండ్‌ టీమ్‌. ‘జిందగీ నా మిలేగి దోబారా’ ఫేమ్‌ జోయా అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్, ఆలియా భట్‌ జంటగా రూపొందిన చిత్రం ‘గల్లీబాయ్‌’. ఈ సినిమాలోని లుక్‌ కోసం రణ్‌వీర్‌ బాగా వెయిట్‌ లాస్‌ అయిన సంగతి తెలిసిందే. ఆలియా భట్‌ క్యారెక్టర్‌ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందని బీటౌన్‌ టాక్‌.

‘‘గల్లీబాయ్‌’ షూటింగ్‌ను కంప్లీట్‌ చేశా’ అని పేర్కొన్నారు రణ్‌వీర్‌సింగ్‌. ‘గల్లీబాయ్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అదేంటీ.. సినిమా కంప్లీట్‌ అయింది కదా.. రిలీజ్‌కు 10 నెలలా? అనుకోవచ్చు. ఇది ప్రేమకథా చిత్రం కాబట్టి వచ్చే ప్రేమికుల దినోత్సవానికి ప్లాన్‌ చేశారట. ఈ షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన వెంటనే రణ్‌వీర్‌ ‘సింబా’తో బిజీ కానున్నారు. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న ‘సింబా’ సినిమా తెలుగు ‘టెంపర్‌’కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కానున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top