నవంబర్‌ 10న దీపికా, రణ్‌వీర్‌ వెడ్డింగ్‌..

Ranveer And Deepika Padukone Getting Married On November Tenth - Sakshi

సాక్షి, ముంబై : కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌, హీరో రణ్‌వీర్‌సింగ్‌లు వివాహ బంధంతో ఒక్కటవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్‌ 10న వీరి వివాహం జరగనుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కొద్దినెలలుగా వీరి పెళ్లిపై రోజుకో కథనం వెల్లడవుతున్నా ఇటీవలే ఈ స్టార్‌ జోడీ వివాహ తేదీపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వివాహ తేదీపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం నవంబర్‌ 10న వెడ్డింగ్‌కు నటులిద్దరితో పాటు ఇరు కుటుంబాలూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయని సమాచారం. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల తరహాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తారా, వివాహ వేడుకకు బెంగళూర్‌ వేదిక అవుతుందా అనే వివరాలపై స్పష్టత రాలేదు.

మరోవైపు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వివాహ వేడుక నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని అయితే దీనిపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని దీపికా పదుకోన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మూవీ కమిట్‌మెంట్స్‌ను త్వరగా పూర్తిచేసి వివాహ వేడుకకు సిద్ధమయ్యేందుకు రణ్‌వీర్‌సింగ్‌ సన్నద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top