సినిమా రంగ పరిస్థితులపై..

సినిమా రంగ పరిస్థితులపై..


రవీంద్రతేజ్, అక్షర జంటగా ఎల్‌వీ మూవీ మేకర్స్‌ పతాకంపై వి. క్రాంతి కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రంగుల కల’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎం. రాజ్‌కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు.దర్శక–నిర్మాత వి. క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను తెలియజేసే చిత్రమిది. వరూధిని అనే హీరోయిన్‌ను ఓ పల్లెటూరులో రైతు కొడుకు ఇష్టపడతాడు. ఆమెను కలుసుకుని, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నదే కథ. హైదరాబాద్, అమరావతి, కర్ణాటకల్లో షూటింగ్‌ చేస్తాం. ఈ సినిమా కోసం రాజ్‌కుమార్‌గారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు.

Back to Top