కొత్త ఇంటి ఫొటోలు షేర్‌ చేసిన కంగనా సోదరి

Rangoli Chandel Shares Her Super Luxurious House In Lap Of Himalayas - Sakshi

తన కల నిజమైందంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌. హిమాలయాల పాదాల చెంత తాము నిర్మించుకున్న కలల సౌధానికి ‘విల్లా పెగాసస్‌’ అని పేరు పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేగాక తన ముద్దుల చెల్లెలు కంగన ఈ ఇంటిని ఎంతో అందంగా అలకరించినట్లు తెలిపారు. అంతేగాక ఇంటీరియర్‌ వర్క్‌ ఎక్కువ శాతం స్థానికంగా దొరికే వస్తువులతోనే నింపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, విశేషాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు)

‘‘మా ఇంటికి విల్లా పెగాసస్‌ అని నామకరణం చేశాం. అంటే గ్రీకు భాషలో రెక్కల గుర్రం అని అర్థం. నిజానికి నేను అజయ్‌ ముంబైలోని ఓ అపార్టుమెంటులో వైవాహిక జీవితం ప్రారంభించాం. పృథ్వి అక్కడే పురుడుపోసుకున్నాడు. ఆ జ్ఞాపకాలు పదిలం చేసుకునేందుకు దాని పేరు మీదుగానే ఇప్పుడు ఈ పేరు నిర్ణయించాం. ఫొటోలు దీని అందాన్ని వర్ణిస్తాయి. నిజానికి ఇది కేవలం కట్టడం కాదు.. దేవుడిచ్చిన ఆశీర్వాదం. తన ఇంట్లోకి తొలిసారిగా అడుగుపెట్టిన పృథ్వికి తన పిన్ని హారతి పట్టి స్వాగతం పలికింది. చిన్న చిన్న సంతోషాలను వేడుకలా చేసుకోవడం తనకు ఇష్టం. ఈ ఇంటిని అందంగా మార్చింది తనే’’అంటూ కంగనాపై ప్రేమను చాటుకున్నారు.(రంగోలి సంచలన వ్యాఖ్యలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top