ద్విభాషా చిత్రానికి రానా వాయిస్

Rana Daggubati dubs for Rajaratham - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో రానాకు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రానా జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు. అందుకే తెలుగు సినిమాను ఇతర భాషల్లో ప్రమోట్ చేయాలన్నా.. పరభాషా చిత్రాలను తెలుగులో రిలీజ్ చేయాలన్నా రానా లాంటి నటులను ఆశ్రయిస్తున్నారు. అదే బాటలో త్వరలో తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాకు రానా సాయం చేస్తున్నాడు.

రాజరథం పేరుతో తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలోని ఓ పాత్రకు రానా డబ్బింగ్ చెపుతున్నాడు. అయితే రానా చెప్పబోయేది మనిషి పాత్రకు కాదు. సినిమాలో కీలకంగా కనిపించనున్న ఓ బస్సుకు రానా వాయిస్ అందిస్తున్నాడు. ఇదే క్యారెక్టర్ కు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గాత్రమందిస్తున్నారు. అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య, పి. రవిశంకర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top