తెలంగాణ యాసలో రామ్‌ కుమ్మేస్తాడట!

Ram Pothineni Trying Telangana Slang In Puri Jagannath Movie - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌కు గతకొంతకాలంపాటు సరైన హిట్‌ పడటం లేదు. రీసెంట్‌గా ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ పలకరించినా.. అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టేపనిలో పడ్డాడు. అయితే అసలే ఫామ్‌లో లేని పూరి జగన్నాథ్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

ఈ మూవీ టైటిల్‌.. ఇస్మాట్‌ శంకర్‌(IS) అని రామ్‌ తన ట్విటర్‌లో ఇచ్చిన క్లూతో అర్థమైపోతోంది. ఈ చిత్రంలో రామ్‌.. తెలంగాణ యాసతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసమే రామ్‌ తెలంగాణ యాసపై మరింత పట్టు సంపాదించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్‌ విషెస్‌ కూడా తెలంగాణ యాసలో ఫన్నీగా చెప్పాడు. మరి ఈ సినిమా రామ్‌ సినీ కెరీర్‌కు ఏవిధంగా సహాయపడుతుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top