బాబు మాటలకు వర్మ కౌంటర్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నేతలు వర్మపై విమర్శలు చేయగా వర్మ వాటికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చాడు వర్మ.
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చంద్రబాబు మాటలకు సమాధానంగా.. 'సీబీఎన్ గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమే.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను' అంటూ కౌంటర్ వేశారు. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.