గుర్తుకొస్తున్నాయని అంటోన్న చెర్రీ

Ram Charan Visits His School In Chennai And Remembers Old Days - Sakshi

ఎవరి లైఫ్‌లో అయినా సరే స్కూల్‌ ఏజ్‌ ఓ మధురానుభూతిని మిగిల్చే ఉంటుంది. అందుకే అందరూ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకుంటూ ఉంటారు. చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలు, బాల్య స్నేహితులు, పాఠశాలలో గడిపిన రోజులు ఇలా వాటిని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటే కలిగే ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం అలాంటి ఫీలింగ్‌నే ఎంజాయ్‌ చేస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో భాగంగా గాయపడిన చెర్రీ గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే చరణ్‌ ఇటీవలె తన స్కూల్‌ డేస్‌ను గుర్తు తెచ్చుకుంటూ.. చెన్నైలో తాను చదువుకున్న లారెన్స్ లవ్ డేల్‌ను సందర్శించారు. అక్కడి వాతావరణాన్ని, ప్రదేశాలను, క్యాంటీన్‌, హాస్టల్‌ రూమ్‌లను తనివి తీరా చూస్తూ ఆనందపడిపోయారు. అక్కడి విద్యార్థులతో కాసేపు గడిపి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top