లండన్‌ కాలింగ్‌!

లండన్‌ కాలింగ్‌!


అన్నీ ఉన్నాయా? ఏదైనా మిస్‌ అయ్యామా? అంటూ రకుల్‌ ఒకటికి రెండుసార్లు సూట్‌కేస్‌ చెక్‌ చేసుకుంటున్నారట. మరి... ఒక ట్రిప్‌కి వెళ్లడమంటేనే ప్యాకింగ్‌ కష్టం. ఇక అట్నుంచి అటు ఇంకో ట్రిప్‌ అంటే... ఏదీ మిస్సవ్వకుండా సర్దుకోవాలి కదా. ఇంతకీ రకుల్‌ రెండు ట్రిప్స్‌ ఏంటి? అనే విషయంలోకి వస్తే.. తమిళ చిత్రం ‘ధీరన్‌ అధికారమ్‌ ఒండ్రు’ షూటింగ్‌ కోసం చెన్నై వెళ్లారామె. అక్కడ కొన్ని రోజులు షూటింగ్‌ చేశారు. అట్నుంచి అటు లండన్‌ వెళ్లిపోయారు.ఈ ట్రిప్‌ హిందీ చిత్రం ‘అయ్యారీ’ కోసం. ట్రిప్‌ మీద ట్రిప్‌ కావడంతో లగేజీని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్నానని రకుల్‌ పేర్కొన్నారు. ‘‘ధీరన్‌ అధికారమ్‌ ఒండ్రు’ షూటింగ్‌ భలే కిక్‌ ఇచ్చింది. అదే జోష్‌తో లండన్‌ వెళ్లా. ‘అయ్యారీ’ షూటింగ్‌ కూడా మంచి అనుభూతినిస్తుంద నుకుంటున్నా’’ అన్నారు రకుల్‌. మొత్తానికి తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో రకుల్‌ బిజీ బిజీగా ఉన్నారు. ఆడుతూ పాడుతూ అలుపూ సొలుపూ లేకుండా పని చేస్తున్నారామె.

Back to Top