రెహమాన్ స్టూడియోలో రజనీ షూట్

Rajinikanth Shankar Rahaman - Sakshi

తన స్వరాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, మరో రంగంలోకి అడుగుపెట్టారు. పాటల రచయితగా విజయం సాధించిన రెహమాన్... ఇటీవల నిర్మాతగా మారి 99 అనే మ్యూజికల్ లవ్ స్టోరి ని నిర్మించారు. ఆయన తాజాగా చెన్నైలో ఫిలిం స్టూడియోను ప్రారంభించారు. రెహమాన్ స్థాపించిన ఈ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రంగా 2.0 నిలవనుంది.

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 2.0. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని చివరి పాటను రెహమాన్ ప్రారంభించిన వైయం స్టూడియోలో షూట్ చేస్తున్నారు. బుధవారం ఈ పాట షూటింగ్ ప్రారంభించారు. రజనీకాంత్, అమీజాక్సన్ ల పై చిత్రీకరిస్తున్న ఈ పాటతో 2.0 షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top