బీ పాజిటివ్‌

Raja the Great Movie Team Interview - Sakshi

ఫిల్మ్‌లో నెగిటివ్‌ ఉంటుంది. ఫిల్మ్స్‌లో నెగిటివ్‌ క్యారెక్టర్స్‌ ఉంటాయి. కానీ, రవితేజ లైఫ్‌లో నో నెగిటివ్‌. హీ ఈజ్‌ ఆల్వేస్‌ పాజిటివ్‌. ఆయన పాజిటివ్‌గా ఉండడం, ఆలోచించడమే కాదు... కుమారుడు మహాధన్‌కి కూడా ‘బీ పాజిటివ్‌’ అనే చెబుతున్నానంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘రాజా... ది గ్రేట్‌’. ఇందులో హీరో చిన్నప్పటి పాత్రలో మహాధన్‌ నటించడం విశేషం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలవుతున్న సందర్భంగా రవితేజతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

 మీరు పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ చేస్తారు. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌... కామెడీ ఫిల్మ్స్‌ విత్‌ యాక్షన్‌ చేస్తారు. హిందీలో అక్షయ్‌కుమార్‌లా! ఫిట్‌నెస్‌ విషయంలో గానీ... ప్రొఫెషనల్‌ విషయాల్లో గానీ... అక్షయ్‌కుమార్‌ నాకు ఎంతో కొంత ఇన్‌స్పిరేషన్‌. నిజాయితీగా చెబుతున్నా... ఫిట్‌నెస్‌ విషయంలో అతనే. అక్షయ్‌ నా సినిమాలన్నీ చూస్తారని తెలిసింది.

► మీ సిన్మాలు పెద్ద విజయాలు సాధించినా... మీపై విమర్శలొచ్చినా... మీరు మాట్లాడరెందుకు?
నేను మాట్లాడను. నేను చేసే పనే జనాల్లో మాట్లాడాలి. సినిమా మాట్లాడాలి. బేసిగ్గా నేనింతే! నా ప్లస్‌ పాయింట్స్‌ నాకు తెలీదు. బట్, నా మైనస్‌ పాయింట్స్‌ బాగా తెలుసు.

► ఆ మైనస్‌ పాయింట్స్‌ ఏంటో మాకు చెబుతారా?
(నవ్వుతూ...) ఎందుకు? నాకు తెలిస్తే చాలు కదా! ఐయామ్‌ వెరీ క్లియర్‌. ఏమో... సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా అందరితో షేర్‌ చేసుకుంటానేమో!

► రవితేజ వంటి మాస్‌ కమర్షియల్‌ హీరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తాడనడానికి ‘రాజా... ది గ్రేట్‌’ స్టార్టింగ్‌ పాయింట్‌ అవుతుందా?
తప్పకుండా. సిన్మా ఎవ్వర్నీ డిజప్పాయింట్‌ చేయదు. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనీ, బాగుంటుందనీ మేమంతా నమ్ముతున్నాం.

► మీరు మంచి మాస్‌ హీరో. ఈ సిన్మా చేయడం రిస్క్‌ అనుకోలేదా? అంధుడిగా ఎందుకు చేశారు?
నేనెందుకు చేశా? ఏంటి? అనేది ఎల్లుండి తెలుస్తుంది. సేమ్‌ టైప్‌ ఆఫ్‌ సిన్మాలు చేయాలనుకోవడంలేదు! ఇప్పుడు ప్రేక్షకులు ఎంతోకొంత కొత్తదనం కోరుకుంటున్నారు. ట్రైలర్‌కు ఇంత రెస్పాన్స్‌ వచ్చిందంటే.. తప్పకుండా ఇందులో ఏదొక కొత్తదనం ఉందనే కదా! ఇప్పుడది చాలా ఇంపార్టెంట్‌.

► చూపు లేకపోతే ప్రతి క్షణం చీకటే! ఈ సినిమా కోసం అంధుడిగా నటించినన్నిరోజులూ ఎలా చేశారు? చీకటిని ఎలా ఊహించుకున్నారు?
ఎండ్‌ ఆఫ్‌ ది డే... నేను చేసిందంతా యాక్టింగే కదా! సెట్స్‌లో కెమెరా లైట్స్, షూటింగ్‌ హడావుడి... అన్నీ నాకు తెలుస్తాయి కదా! నేను చీకట్లో షూటింగ్‌ చేయలేదుగా... సిన్మాలోని పాత్రలా ప్రవర్తించాను. ప్రేక్షకుల్ని ‘నేను అంధుణ్ణి’ అని నమ్మించేటట్టు చేయాలి. అంధులు ఎలా ప్రవర్తిస్తారు? అనే అవగాహన నాకూ, మా దర్శకుడు (అనిల్‌ రావిపూడి)కి ఉంది. తనకు అవగాహన ఉంది కాబట్టే... ఇలాంటి కథ రాశాడు.

► కథ విన్న తర్వాత... బ్లైండ్‌ పీపుల్‌ లైఫ్‌ స్టైల్‌ పై రీసెర్చ్, అబ్జర్వేషన్‌ వంటివి చేశారా?
అబ్జర్వేషన్‌ లేకపోతే చేయలేం! నాకది తెలుసు. అందుకని, కొంత అబ్జర్వేషన్‌ చేశా. నేత్రా విద్యాలయ స్కూల్‌ సెలబ్రేషన్స్‌కి వెళ్లా. అప్పుడు వాళ్లంతా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో తెలిసింది. ‘వాళ్లు (బ్లైండ్‌ పీపుల్‌) డల్‌గా ఉన్నారు. ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నారు’ అని అనుకుంటుంటాం. కానీ, అది తప్పు. మన కంటే (చూపు ఉన్నవాళ్ల) కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్లను చూసి ముచ్చటపడ్డాను. అప్పుడు ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీలయ్యాను.

► ట్రైలర్‌ చూస్తే... యాక్షన్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. హీరో బ్లైండ్‌ అన్నప్పుడు... ఫైట్స్‌లో కాన్సెప్ట్‌ బేస్డ్‌ వెళ్లాలేమో కదా?
ఎగ్జాట్‌లీ... కాన్సెప్ట్‌ బేస్డ్‌ అనేది రైట్‌ వర్డ్‌! యాక్షన్‌ సీన్లను మంచి కన్విక్షన్‌తో చేశాం. ట్రైలర్‌ చూసుంటారు కదా... ‘ఐయామ్‌ బ్లైండ్‌. బట్, ట్రైన్డ్‌’, ‘ఐయామ్‌ ఎ వారియర్‌’ అనే సీన్స్‌ సిన్మాలో బెస్ట్‌ పార్ట్‌. ఇందులో ఫైట్స్‌ని వెంకట్‌ డిజైన్‌ చేశాడు. నేను ఎక్కువ సినిమాలు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌లతోనే చేశా. వాళ్ల అన్న కుమారుడే వెంకట్‌. నేను ఊహించినదాని కంటే వెంకట్‌ చాలా బాగా చేశాడు. ఇందులో యాక్షనే కాదు... ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, మంచి సాంగ్స్‌ ఉన్నాయి. ఇట్స్‌ ఎ ప్యాకేజ్‌.

► హిందీ ‘కాబిల్‌’లో హృతిక్‌ రోషన్, తమిళ–మలయాళ ‘సోలో’లో దుల్కర్‌ సల్మాన్‌ అంధులుగా నటించారు. మీరు ఆ సినిమాలు చూశారా?
చూశా. కానీ, ఈ సినిమా కోసమని చూడలేదు. మామూలుగా సినిమాలన్నీ చూస్తాను. అలాగే, అవీ చూశా. అఫ్‌కోర్స్‌... ఇప్పుడీ సబ్జెక్ట్‌ చేశా కాబట్టి వేరే మైండ్‌ సెట్‌తో చూస్తాను. వాళ్లిద్దరూ సూపర్బ్‌ యాక్టర్స్‌. చాలా బాగా యాక్ట్‌ చేశారు. నేనెలా చేశాననేది సినిమా విడుదల తర్వాత జనాలు చెబుతారు.

► నటుడిగా మీకెంతో అనుభవం ఉంది. కానీ, ఓ అంధుడి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. అందువల్ల, బాగా కష్టపడిన సందర్భం ఏదైనా ఉందా?
ఇప్పటివరకూ నా కెరీర్‌ స్టార్టింగ్‌ దగ్గర్నుంచి... నేనేదీ కష్టపడి చేయలేదు. అన్నీ ఇష్టపడే చేశా. నాకు కష్టమనే ఫీలింగే రాదు. ఫిజికల్‌గా ఎంతో కొంత కష్టం నేనే కాదు... ఎవరైనా పడతారు. నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులకూ ఫిజికల్‌ స్ట్రెయిన్‌ ఉంటుంది. బట్, దే ఆర్‌ బ్యూటిఫుల్‌ పెయిన్స్‌. ఆ పెయిన్స్‌ని ఎంజాయ్‌ చేయాలి. నేను ఎంజాయ్‌ చేస్తా.

► రవితేజ ఎంతసేపు వర్క్‌ చేసినా ఏమాత్రం ఎనర్జీ తగ్గదని అందరూ చెబుతుంటారు. మీ ఎనర్జీ సీక్రెట్‌ ఏంటి?
సీక్రెట్‌ ఏముంది? అంతా మైండ్‌! ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. థింక్‌ పాజిటివ్‌.. బీ పాజిటివ్‌.

► చివరగా... మీ అమ్మగారు ఎలా ఉన్నారు?
ఇంట్లో అందరూ బాగున్నారు. ఆల్‌ ఈజ్‌ వెల్‌. లైఫ్‌లో కొన్ని జరుగుతుంటాయి. ఎవ్రీథింగ్‌ పాసెస్‌ అంతే.

మహాధన్‌ ఎంట్రీ నాకూ సర్‌ప్రైజే!
 మీ అబ్బాయి ఇందులో నటించాడనే వార్త, మీ ఇద్దరి ఫొటోలు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌!
ఫ్యాన్స్‌కే కాదు. నాకూ సర్‌ప్రైజే. యాక్చువల్లీ... ఇందులో మహాధన్‌తో నటింపజేయాలనే ఆలోచన దర్శకుడు అనిల్‌దే. నాకయితే ఇష్టం లేదు. అనిలే కన్విన్స్‌ చేశాడు.

► మీకంటే ఎంతో అనుభవం ఉంది. అంధుడిగా నటించేశారు. మహాధన్‌ ఎలా నటించాడు?
మా టీమ్‌ అందరూ బాగా చేశాడని అంటున్నారు. తను చేసిన సీన్లన్నీ చూడలేదు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఒకటో... రెండో... క్లిప్పింగ్స్‌ చూశా. వాడూ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాడు.

► అబ్బాయి షూటింగ్‌ చేసినప్పుడు మీరు సెట్స్‌లో ఉన్నారా?
తనూ, నేను సేమ్‌ టైమ్‌లో కొన్ని షాట్స్‌ చేసినప్పుడు ఉన్నా. మిగతా టైమ్‌లో నేను లేను.

► మహాధన్‌ యాక్టింగ్‌ చేస్తున్నాడనగానే ఫ్యామిలీ మెంబర్స్‌ ఎలా ఫీలయ్యారు? మీ అమ్మాయి ఫీలింగ్‌?
అందరూ హ్యాపీగానే ఫీలవుతారు కదా. వాళ్ల అక్క అయితే... ‘వీడా? యాక్టింగా?’ అని నవ్వేసింది.

► ఇంట్లో మీరిద్దరూ సినిమాల గురించి మాట్లాడుకుంటారా?
నాకంటే సినిమాల గురించి వాడే ఎక్కువ మాట్లాడతాడు.

► మహాధన్‌కి మీరు చేసిన సినిమాల్లో నచ్చినవి?
ఫాదర్‌ కాబట్టి.... నా ముందు అన్నీ బాగుంటాయంటాడు. ‘కిక్‌’ అంటే బాగా ఇష్టం. ఇప్పుడీ సినిమా కోసం వాడు వెయిటింగ్‌. ఇప్పుడు వాడికి పదేళ్లు. ఆ వయసు కంటే వాడిలో ఎక్కువగానే మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు జనరేషనే అంత.

► మీ అబ్బాయికి మీరిచ్చే సలహా?
ఏదీ వాడిపై రుద్దను. కానీ, ‘బీ పాజిటివ్‌’ అని చెబుతుంటా. ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అనేది వెరీ ఇంపార్టెంట్‌.

 సత్య పులగం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top