మాటల మాంత్రికుడితో మాస్‌ హీరో

మాటల మాంత్రికుడితో  మాస్‌ హీరో - Sakshi


చిన్న ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా! – ఎప్పట్నుంచో వినిపిస్తోన్న వార్త ఇది. ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో మాస్‌ హీరో కాంబినేషన్‌ ఇప్పటికి సెట్‌ అయ్యింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా శనివారం ఈ సినిమా గురించి అధికారికంగా  ప్రకటించారు. సెప్టెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇదే బేనర్‌లో పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందన్నారు నిర్మాత చినబాబు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top