అమాయక కుర్రోడి కథ

PVM Jyothi Arts Production No 1 Movie Opening - Sakshi

మహిరాథోడ్, రేణుకా బైరాగి జంటగా నటిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. మహిరాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. పీవీయమ్‌ జ్యోతి ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ పాలమూరి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి  నటుడు ‘దిల్‌’ రమేశ్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాతల్లో ఒకరైన సిస్టర్‌ మణి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు శివ మాట్లాడుతూ–‘‘ఇది నా తొలిచిత్రం.

ఈ నెల 14న షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. త్వరలోనే టైటిల్‌ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాను నిర్మిస్తున్నా’’ అన్నారు హీరో మహి. నటుడు ‘దిల్‌’ రమేశ్‌ మాట్లాడుతూ– ‘‘యాత్ర’ చిత్రం తర్వాత నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఈ చిత్రంలోకూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నా. అమాయక కుర్రోడు ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనేది ఈ సినిమా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top