పవర్‌ ఆఫ్‌ యూత్‌

Puneeth Rajkumar goes back to college for Yuva Ratna - Sakshi

కాలేజీకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌. 40ఏళ్ల వయసులో ఆయన కాలేజీకి వెళుతోంది మీరు ఊహించనట్టు సినిమా కోసమే. కానీ, లెక్చరర్‌గా కాదు.. స్టూడెంట్‌గా. పునీత్‌రాజ్‌ కుమార్‌ హీరోగా సంతోష్‌ ఆనంద్రామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘యువరత్న’. ‘పవర్‌ ఆఫ్‌ యూత్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ నెల 1న ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో స్టార్ట్‌ కానుంది. అయితే ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ స్టూడెంట్‌ పాత్రలో పునీత్‌ నటించనున్నారని శాండిల్‌వుడ్‌ సమాచారం. ప్రస్తుతం ఆయన ‘నటసార్వభౌమ’ అనే సినిమాలో నటిస్తున్నారు. పవన్‌ వడయార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనూపమా పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top