కాంబినేషన్‌ సెట్‌

Producer Confirms NTR's Film With KGF Director - Sakshi

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నారని, అదీ ఎన్టీఆర్‌ హీరోగా ఉండబోతోందని ఆ మధ్య పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌ సెట్‌ అయిందని తెలిసింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని ఓ వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘కేజీఎఫ్‌’ చిత్రం ఎన్టీఆర్‌కు చాలా నచ్చింది. ఆ దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని మాతో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్‌ 2’తో ప్రశాంత్‌ నీల్‌ బిజీగా ఉన్నారు. వాళ్ల ప్రాజెక్ట్స్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది చివర్లో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top