ప్రియాంక ఎంగేజ్‌మెంట్‌కి ఆ నటి ఎందుకు హాజరుకాలేదు..

Priyanka Chopra Was Not Invites Deepika For Her Engagement Party - Sakshi

బాలీవుడ్‌ నటి  ప్రియాంకా చోప్రా, అమెరికా సింగర్‌ నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ శనివారం ముంబైలో రోకా ఫంక్షన్‌ పేరుతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖులు ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ, ఈషా అంబానీ, సంజయ్‌ లీలా భన్సాలీ, విశాల్‌ భరద్వాజ్‌, ఆయుష్‌ శర్మ, అలియా భట్‌, అర్పితా ఖాన్‌, పరిణీతి చోప్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

కాగా ఈ వేడుకకు ప్రియాంక స్నేహితురాలు దీపికా పదుకొణే హాజరుకాకపోవడం బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రియాంక ఎంగేజ్‌మెంట్‌కి దీపికా తప్పక హాజరవుతుందని అంతా అనుకున్నారు. కానీ శనివారం ఆమె హాజరుకాకపోవడంతో కారణం ఏంటని బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. తెలిసిన వివరాల ప్రకారం ప్రియాంక తన ఎంగేజ్‌మెంట్‌కి దీపికాను ఆహ్వానించలేదట. అందుకే దీపిక శనివారం జరిగిన ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు వెళ్లలేదట. ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. దీపికా బాయ్‌ప్రెండ్‌ రణవీర్‌ని మాత్రం ప్రియాంక ఆహ్వానించిదట. అయితే క్లోజ్‌ ప్రెండ్‌ అయిన దీపికాను కాదని రణవీర్‌ మాత్రమే ఎందుకు ఇప్పటికి మిస్టరిగానే మిగిలిపోయింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top