సెప్టెంబర్‌లో ప్రియాంక వెడ్డింగ్‌..

Priyanka Chopra To Marry Nick Jonas In September - Sakshi

సాక్షి, ముంబై : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ల సన్నిహిత బంధంపై రోజుకో వార్త ప్రచారంలో ఉండగా, తాజాగా సెప్టెంబర్‌లో నిక్‌ బర్త్‌డే సందర్భంగా అదే రోజు వివాహ బంధంతో వీరిరువురూ ఒక్కటవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించగా సెప్టెంబర్‌ 16న నిక్‌ బర్త్‌డే సందర్భంగా వీరి వివాహానికీ అదే రోజు ముహుర్తం ఖరారైందని చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో వివాహ ఏర్పాట్ల కోసమే ప్రియాంక చోప్రా సల్మాన్‌ ఖాన్‌ మూవీ భారత్‌ నుంచి వైదొలిగినట్టు సమాచారం. భారత్‌ దర్శకుడు సైతం ప్రియాంక, నిక్‌ వివాహంపై పరోక్షంగా ట్వీట్‌ సంకేతాలు పంపడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే తమ ప్రేమ, వివాహ ప్రణాళికలపై ఇరు కుటుంబాలను ఒప్పించినట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top