ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో హీరోయిన్‌ హల్‌చల్‌..!

Priyanka Chopra Dance At Her Engagement Bash With Nick Jonas - Sakshi

బాలీవుడ్‌ తార ప్రియాంక చోప్రా అమెరికా పాటగాడు నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ శనివారం సంప్రదాయబద్ధంగా ముంబైలో రోకా ఫంక్షన్‌ పేరుతో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సన్నిహితులకు ప్రియాంక ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సాయంత్రం వేళ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకచోప్రా డ్యాన్స్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. 

కాగా, ప్రియానిక్‌ వేడుకలో అలియాభట్‌, ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ, ఇషా అంబానీ, సంజయ్‌ లీలా బన్సాలీ, విశాల్‌ భరద్వాజ్‌, పరిణీతి చోప్రా, సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్‌ శర్మ, ఆమె భర్త ఆయూష్‌ శర్మలు పాల్గొని సందడి చేశారు. ఇక నిక్‌ జోనాస్‌ తనకు కాబోయే భార్య ప్రియాంక చోప్రా, తల్లిదండ్రులు కెవిన్‌ జోనాస్‌, డెనిస్‌లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

అలియాభట్‌, ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌, సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్‌ శర్మ, పరిణీతి చోప్రా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top