ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ

ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ

 సుధీర్‌బాబు, నందిత జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. మారుతి సమర్పణలో సుదర్శన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఈ సక్సెస్‌ని అందించిన మారుతికి నిర్మాత ధన్యవాదాలు తెలియజేశారు. 

 

 దర్శకుడిగా నా మొదటి సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో చేసిన పాత్ర తన కెరీర్‌కి మంచి మలుపయ్యిందని సప్తగిరి తెలిపారు. మారుతి మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా బాగా రావడానికి యూనిట్ మొత్తం కారణం. ఓ దర్శకుణ్ణి వరుసగా విజయాలు వరిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. 

 

  ప్రస్తుతం చేస్తున్న ‘కొత్త జంట’ చిత్రం కూడా  వినోదం, వైవిధ్యం కలగలిపిన కథాంశంతో రూపొందుతున్నదే.  ఆగస్ట్ 2న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. సమాజంలో పేరుకుపోయిన స్వార్థం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది’’ అన్నారు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top