ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..?

ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..?


బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో ప్రభాస్ మరోసారి బాహుబలిగా అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 28న బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ కన్నా ముందే ప్రభాస్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, బాహుబలి 2 తో పాటు టీజర్ ను రిలీజ్ చేస్తారన్న వార్త యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది.అయితే తాజా సమాచారం ప్రకారం 23న రిలీజ్ చేస్తారని భావించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం లేదని తెలుస్తోంది. అంతేకాదు బాహుబలి 2 సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు. టైటిల్ ను కూడా మరికొద్ది రోజులు తరువాత ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఇంత వరకు ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందిచలేదు.

Back to Top