మస్కా కొడుతుంటారు!

prabhas sahoo movie updates - Sakshi

స్టార్‌ హీరోలు పబ్లిక్‌లో కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌తో పాటు పబ్లిక్‌ కూడా వాళ్లతో సెల్ఫీలు దిగాలని, తమ అభిమాన తారను దగ్గరగా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. అది సహజం. దీంతో బయటకు రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు స్టార్స్‌. అలా అని బయటకు రావాలని ఉండకుండా ఉండదు. అందుకే పబ్లిక్‌ ప్లేసెస్‌లోకి రావాలనుకున్నప్పుడు ముసుగు వేసుకునో లేదా మాస్క్‌నో అడ్డుగా పెట్టుకుంటారు. ప్రభాస్‌ కూడా బయటకు రావాలంటే ఇలాంటి ట్రిక్కే ఉపయోగిస్తారట.

సౌత్‌లో సూపర్‌ పాపులారిటీ ఉన్న ప్రభాస్‌ క్రేజ్‌ను ‘బాహుబలి’ సిరీస్‌ అమాంతం పెంచేసింది. దాంతో ఈ హ్యాండ్‌సమ్‌ హీరో బయటకు రావాలంటే క్యాప్స్, తల చుట్టూ ఉండే మాస్కులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. దానికోసం ఓ పెద్ద కలక్షనే ఉందట ప్రభాస్‌ దగ్గర. సుమారు 60 టోపీలు, 50 రౌండ్‌ మాస్కులు ఉన్నాయట ఆయన బీరువాలో.  సో.. ఇలా ఎవ్వరూ గుర్తుపట్టకుండా తనకు తాను టోపీ పెట్టుకుని తిరుగుతుంటారన్నమాట ప్రభాస్‌.

ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడకుండా ఇలా ప్లాన్‌ చేసినట్టున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ లవ్‌ స్టోరీలో యాక్ట్‌ చేస్తున్నారు. ‘‘ప్రభాస్‌ 20వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వాలనుంది. ప్రత్యేకమైన సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా షూటింగ్‌ అయితే సూపర్‌ స్పీడ్‌గా జరుగుతోంది. 2019 చివరికల్లా ఓ అద్భుతమైన సినిమాను రెడీ చేయనున్నాం’’ అని దర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top