అసలు సిసలు యాక్షన్‌

prabhas sahoo movie update - Sakshi

‘సాహో’ చిత్రంలో అసలు సిసలు యాక్షన్‌ మొదలైంది. ఎందుకంటే.. యాక్టర్స్‌ అందరూ ఒక్కొక్కరిగా లొకేషన్‌కు చేరుకుంటున్నారు. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, ఎవెలిన్‌ శర్మ ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అబుదాబిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ సెట్‌లోకి తాజాగా నటుడు అరుణ్‌ విజయ్, మురళీ శర్మ జాయిన్‌ అయ్యారు.

ఆల్రెడీ ప్రభాస్‌తో సహా మిగతా కీలక నటులంతా ఈ అబుదాబి యాక్షన్‌ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. అంటే..‘సాహో’లో అసలు సిసలు యాక్షన్‌ మొదలైందన్నమాట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top