ఆ ఆర్టిస్టు ఇక లేరు

ఆ ఆర్టిస్టు ఇక లేరు


తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ హాస్యనటుడు  ప్రముఖ కథాప్రసంగ కళాకారుడు వీ.డి రాజప్పన్ (70)కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన గురువారం  తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం  అంత్యక్రియలు నిర్విహించనున్నట్టు వెల్లడించారు.రాష్ట్రంలో ఒకప్పుడు  అత్యంత ప్రసిద్ధమైన కళ కథాప్రసంగం 70వ దశకంలో ఒక వెలుగు వెలిగింది. ఈ కళలో రాజప్పన్ విశిష్టుడు. నటన, గానం, మాటలు,  సంగీత వాయిద్యాలు మేళవిపుంతో ఆయన చేసే కథా ప్రసంగం బహుళ ప్రాచుర్య పొందింది.  దీంతోపాటుగా  సందర్భానుసారంగా  అదనంగా జోడించే పేరడీ పాటలు  ఆయన ప్రతిభకు అద్దం పట్టేవి. దేశ,  విదేశాలలో 6,000 పైగా ప్రదర్శనలు ఇచ్చారు.  అనంతరం ఆయన  మలయాళ సినీ పరిశ్రమలో ప్రవేశించారు.  1982 నుంచి 2005వరకు  తనదైన హాస్యపాత్రలతో సినీ అభిమానులను అలరించారు. మేలే పరాంబిల్ అనవీడు, అలి బాబాయుం అరారా-కల్లన్ మారుం,  ముతారం కున్ను, కుస్రిత్తుక్కట్టు  తదితర 100 కు పైగా  ఎక్కువ చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపై కేరళ మంత్రి  రాధాకృష్ణన్ సంతాపం వ్యక్తం చేశారు.  భౌతికంగా  ఆయన లేకపోయినా  ఆయన 'కథలు'  శాశ్వతంగా వినవచ్చన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top