బై బై రాఘవ

Pooja Hegde send off to ntr aravinda sametha movie - Sakshi

వీరరాఘవ అండ్‌ టీమ్‌కి అరవింద బైౖ బె చెప్పారు. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాట కోసం టీమ్‌ స్విస్‌–ఇటలీ బోర్డర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పాట చిత్రీకరణ పూర్తయింది. అంతేకాదు.. పూజా హెగ్డే పాత్ర చిత్రీకరణ కూడా పూర్తయింది.

‘‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నా షూటింగ్‌ పార్ట్‌ çపూర్తయింది. అక్టోబర్‌ 11న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పూజా పేర్కొన్నారు. ఇందులో పూజా జర్నలిస్ట్‌ రోల్‌ చేశారని సమాచారం. ఈ సినిమా కాకుండా మహేశ్‌బాబు ‘మహర్షి’, ప్రభాస్‌–రాధాకృష్ణ కాంబినేషన్‌ మూవీలో పూజానే హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే. అలాగే హిందీలో పూజా ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top