పాపం.. పాయల్‌కు ఎంత కష్టం వచ్చింది!

Payal rajput Post About Her Brother Dhruv - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ భామ.. ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో అతిథి పాత్ర(జయసుధ)లో కనిపించారు. నేడు ఈ ముద్దుగుమ్మ సోదరుడైన ధృవ్‌ రాజ్‌పుత్‌ పుట్టినరోజు.

ధృవ్‌ మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడని, ఇప్పటికీ ఆచూకి తెలియలేదంటూ పాయల్‌.. సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘నా బ్రదర్‌ కనబడకుండా పోయి మూడేళ్లు అవుతోంది. హ్యాపి బర్త్‌డే భాయ్‌. ఈ సందేశాన్ని నువ్వు చూస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఎక్కడైనా చిక్కుకుపోయింటే.. ఒక్కసారి మాకు కాల్‌ చేయి. మేము నీ గురించి ఎదురుచూస్తూ ఉంటాము భాయ్‌. ముంబై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది’ అంటూ ధృవ్‌ని కనిపెట్టండని కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top