లుక్‌.. షాక్‌!

'Odiyan' will have long and thrilling climax, says director - Sakshi

ప్రజెంట్‌ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ వయసు ఎంత? అంటే.. అరౌండ్‌ 60 ఉంటాయి. కానీ, 25 యేళ్ల కుర్రాడిలా మారేందుకు మోహన్‌లాల్‌ ప్రతిరోజు ఎనిమిది గంటలు కష్టపడుతున్నారట. సడన్‌గా కుర్రాడిలా ఎందుకు మారాలని ట్రై చేస్తున్నారంటే ఓ సినిమా కోసం. శివకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒడియాన్‌’. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్‌ను కంప్లీట్‌ చేశారు.

అయితే 15 నిమిషాల యాక్షన్‌ క్లైమాక్స్‌ సీన్‌కోసం మోహన్‌లాల్‌ పాతికేళ్ల కుర్రాడిలా మారాల్సి వచ్చిందట. ‘‘ప్రజెంట్‌ క్లైమాక్స్‌ తీస్తున్నాం. 1990లో మోహన్‌లాల్‌ లుక్‌ ఎలా ఉండేవారో ఈ సినిమా క్లైమాక్స్‌లో అలా కనిపిస్తారు. ఆయన లుక్‌ కోసం 25 మంది కష్టపడుతున్నారు. క్లైమాక్స్‌లో ఆయన లుక్‌ చూసి అందరూ షాక్‌ అవుతారు’’ అన్నారు శివకకుమార్‌ మీనన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top