సరికొత్త ప్రేమకథ | new love story | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమకథ

May 20 2015 11:21 PM | Updated on Sep 3 2017 2:23 AM

అందమైన ప్రేమకథ నేపథ్యంలో వన్ స్టాప్ క్రియేషన్స్ పతాకంపై ఉప్పాడ కనకరాజు ఓ చిత్రం నిర్మించనున్నారు.

 అందమైన ప్రేమకథ నేపథ్యంలో వన్ స్టాప్ క్రియేషన్స్ పతాకంపై ఉప్పాడ కనకరాజు ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘దమ్మున్నోడు’, ‘కోడిపుంజు’ చిత్రాల దర్శకుడు బీవీవీ చౌదరి దాన్ని తెరకెక్కించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా వన్ స్టాప్ సంస్థను సినిమా రంగంలోకి  విస్తరించాలన్న ఆలోచనతో తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయనున్నాం. ఈ ప్రేమకథ కొత్తగా ఉంటుంది. హీరో, హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: యం. విజయవర్ధనరావు, సమర్పణ: శ్రీమతి కమలాదేవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement