హాయి హాయిగా...

Neethone Hai Hai official Teaser launch - Sakshi

అరుణ్‌ తేజ్, చరిష్మా శ్రీకర్‌ జంటగా బియన్‌ రెడ్డి అభినయ దర్శకత్వంలో యలమంచిలి ప్రవీణ్, ఏయస్‌ కీర్తి, పార్థసారధి రెడ్డి నిర్మించిన సినిమా ‘నీతోనే హాయ్‌ హాయ్‌’. ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ హాయి హాయిగా ఉంది. వైద్య వృత్తిలో ఉంటూ సినిమా రంగం మీద ఇష్టంతో వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. సినిమా ఫీల్డ్‌లో కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ నిజాయితీగా కష్టపడితే మంచి ఫలితం దక్కుతుంది.

దాసరిగారి లాంటి గొప్ప దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో ఈ సినిమాను దర్శకుడు బాగా తీశారని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు. పాత, కొత్త అన్న తేడా లేదు. కంటెంట్‌ బాగుంటే  ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘మార్చి 7న శ్రీకాంత్‌గారి చేతుల మీదగా ప్రారంభమైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. నన్ను, నా కథను నమ్మి నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు పార్థసారధి. ‘‘డాక్టర్‌ అవ్వాలంటే ఎంత కష్టమో, ఒక సినిమా తీయాలన్నా అంతే కష్టమని ఈ సినిమా తీశాక అర్థమైంది’’ అన్నారు కీర్తి. ‘‘ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌గా తీశాం’’ అన్నారు ప్రవీణ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top