లవ్‌ గేమ్స్‌

Nayanthara celebrates Pac-Man victory against Vignesh Shivan - Sakshi

విఘ్నేష్‌ శివన్, నయనతార తమ ప్రేమను పబ్లిక్‌గా ఒప్పుకోరు. కానీ సోషల్‌ మీడియాలో ఫొటోలు మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నట్టుగా ఉంటాయి. వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలసి సరదాగా ప్రేమ షికార్లు చేస్తుంటారు. రీసెంట్‌గా అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ని సందర్శించారు. తాజాగా నయనతో ఉన్న మరో సరదా వీడియోను అభిమానులతో పంచుకున్నారు విఘ్నేశ్‌. ఇటీవల విఘ్నేశ్‌ బర్త్‌డే సందర్భంగా సరదాగా బయటకు వెళ్లిన వీళ్లు ‘ప్యాక్‌మ్యాన్‌ స్మాష్‌’ (చేత్తో ఆడే హాకీ లాంటి గేమ్‌) ఆట ఆడుకున్నారు. ఈ ఆటలో మొదటి నుంచీ ఆధిక్యంలోనే ఉండి విఘ్నేశ్‌ని చిత్తుగా ఓడించారు నయనతార.

నయనతార 1050 పాయింట్స్‌ సాధించగా విఘ్నేశ్‌ 760 పాయింట్స్‌ చేశారు. గెలిచిన ఆనందాన్ని ఎగిరి గెంతులేసి మరీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రియురాలి చేతిలో ఓటమి కూడా గెలుపులానే ఉందేమో విఘ్నేశ్‌ ఆమె వంక సరదాగా చూస్తుండిపోయారు. ఇలాంటి మూమెంట్స్‌ అన్నీ బెస్ట్‌ అంటూ వీడియోను పంచుకున్నారు. మరి పెళ్లెప్పుడూ? అనే ప్రశ్నకు మాత్రం ‘‘నాకు ఇంకా సరిగ్గా తెలియదు. తెలిస్తే కచ్చితంగా చెబుతాను. ఫస్ట్‌ నయనతారని అడగాలి. అలాగే మా అమ్మని కూడా ఓ మాట అడగాలి’’ అని సమాధానమిచ్చారు విఘ్నేశ్‌. ప్రస్తుతం నయనతార చిరంజీవి ‘సైరా : నరసింహారెడ్డి’, శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. విఘ్నేశ్‌ తన నెక్ట్స్‌ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top